SA20 | సిక్సర్‌తో సెంచరీ.. ఆ తర్వాతి బంతికే ఔట్.. వీడియో
SA20 : దక్షిణాఫ్రికా 20 రెండో సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్(Pretoria Capitals) ఓపెనర్ విల్ జాక్స్(Will Jacks) సెంచరీతో కదం తొక్కాడు. డర్బన్స్ సూపర్ జెయింట్స్(Durbans Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో జాక్స్ వీరవిహారం...
SA20 : దక్షిణాఫ్రికా 20 రెండో సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్(Pretoria Capitals) ఓపెనర్ విల్ జాక్స్(Will Jacks) సెంచరీతో కదం తొక్కాడు. డర్బన్స్ సూపర్ జెయింట్స్(Durbans Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో జాక్స్ వీరవిహారం చేశాడు. 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రిటోరియస్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన జాక్స్ శతకం పూర్తి చేసుకున్నాడు.
అయితే.. ఆ తర్వాతి బంతికే జాక్స్ కవర్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, సూపర్ జెయింట్స్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. విధ్వసంక ఇన్నింగ్స్ ఆడిన జాక్స్ 42 బంతుల్లోనే 9 సిక్సర్లు, 8 ఫోర్లతో 101 రన్స్ చేశాడు.
ప్రిటోరియా క్యాపిటల్స్, సూపర్ జెయింట్స్ మ్యాచ్ హైలెట్స్
తొలుత బ్యాటింగ్ చేసి క్యాపిట్స్ జట్టుకు ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(23), విల్ జాక్స్(101) శుభారంభం ఇచ్చారు. సూపర్ జెయింట్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించారు. సాల్ట్ ఔటయ్యాక జాక్స్ మరింత వేగంగా ఆడాడు.
𝙈𝙖𝙩𝙘𝙝 🔟 𝙧𝙚𝙨𝙪𝙡𝙩 🚨@PretoriaCapsSA are in the winners column ✅#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/JigHwFYiTP
— Betway SA20 (@SA20_League) January 18, 2024
జాక్స్ సుడిగాలి బ్యాటింగ్‌కు ఇన్‌గ్రామ్(43) మెరుపులు తోడవ్వడంతో క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కేశమ్ మహరాజ్ నేతృత్వంలోని సూపర్ జెయింట్స్ ఆది నుంచి తడబడింది. విల్ జాక్స్, పార్నెల్, హర్డస్ విల్జోన్ రెండేసి వికెట్లు పడగొట్టడంతో 187 పరుగులకే పరిమితమైంది. దాంతో, క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టింది.
ఇవి కూడా చదవండి
- Ishan Kishan: ద్రావిడ్ ఆదేశాలు పట్టించుకోని ఇషాన్.. ఇంగ్లండ్‌తో మిగతా సిరీస్‌కూ అనుమానమేనా..?
- Super Heroes: బ్యాట్‌మ్యాన్, ఐరన్ మ్యాన్.. సూపర్‌హీరోలందరూ అయోధ్యలోనే.. ఆకట్టుకుంటున్న ఏఐ పిక్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

