లండన్: క్రికెట్‌తో పోలిస్తే వింబుల్డన్ సెంటర్ కోర్టులోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అన్నారు. వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా జరిగిన జకోవిచ్ వర్సెస్ అలెక్స్ డీ మినార్ మ్యాచ్‌ను కోహ్లీ తిలకించాడు. అయితే ఆ సమయంలో మాజీ టెన్నిస్ ప్లేయర్, కామెంటేటర్ విజయ్ అమృత్‌రాజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడారు. కిక్కిరిసిన స్టేడియంలో క్రికెట్ ఆడడం కన్నా.. వింబుల్డన్‌లోని సెంటర్ కోర్టులో టెన్నిస్ మ్యాచ్ ఆడడమే తీవ్ర వత్తిడిని కలిగిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కేవలం ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో ఉండే వత్తిడి మాత్రమే వింబుల్డన్ మ్యాచ్‌లతో పోల్చవచ్చు అన్నారు.
ప్రేక్షులతో నిండిపోయిన స్టేడియంలో ఆడడం వత్తిడితో కూడుకున్నదే అని, కానీ వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఆడితే ఆ వత్తిడి మరోలా ఉంటుందని కోహ్లీ చెప్పాడు. ఎందుకంటే టెన్నిస్ కోర్టులో ప్రేక్షకులు మరీ దగ్గరగా కూర్చుకుంటారని చెప్పారు. క్రికెట్లో మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటారని, వాళ్ల కామెంట్లు మనకు వినబడవు. కేవలం బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ప్రేక్షకుల అరుపులు వినిపిస్తాయన్నారు. అక్కడ వ్యక్తిగత స్కిల్‌తో పెద్ద ఆటపై ప్రభావం ఏమీ ఉండదన్నారు.
కానీ టెన్నిస్‌లో మాత్రం టెన్షన్ అంతా లైన్ మీదే ఆధారపడి ఉంటుందని కోహ్లీ అన్నాడు. బేస్ లైన్‌కు కాస్త అటు ఇటు పడినా ఫలితం మరోలా ఉంటుందన్నారు. టెన్నిస్‌లో ఆటగాళ్లకు వత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. ఇక సెంటర్ కోర్టులో ఆడే మ్యాచ్‌లకు ఆ ప్రెజర్ మరీ అధికంగా ఉంటుందన్నారు. ఆ అంశంలో టెన్నిస్ ఆటగాళ్ల పట్ల అమితమైన గౌరవం ఉందన్నాడు. వరల్డ్‌కప్‌లోని ఇండోపాక్ మ్యాచ్‌లు, లేదా సెమీస్, ఫైనల్ మ్యాచుల్లో మాత్రమే తీవ్ర వత్తిడి ఉంటుందని, కానీ టెన్నిస్‌లో క్వార్టర్స్ నుంచే ఆ ఫీల్ ఉంటుందన్నారు.