Preity Zinta | బాలీవుడ్ నటి, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశిని కౌగిలించుకున్నట్లుగా ఉన్నది. అయితే, ఈ ఫొటోపై ప్రీతి జింటా ఘాటుగానే స్పందించింది. ఆ ఫొటో ఫేక్ ఫొటో అని.. మార్ఫింగ్ చేశారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ అసలు విషయాన్ని నిర్ధారించుకోకుండానే.. మార్ఫింగ్ ఫొటోను ఉపయోగించి ఓ వెబ్సైట్ కథనం ప్రచురించడంతో తాను షాక్ అయ్యాయనని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అయితే, ఈ నెల 18న రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
This is a morphed image and fake news. Am so surprised now news channels are also using morphed images and featuring them as news items !
— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025
మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా.. ఆర్ఆర్ యువ బ్యాటర్స్ వైభవ్ సూర్యవంశితో కరచాలనం చేసింది. అయితే, ఫొటోను రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లోనూ పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోను మార్ఫింగ్ చేసి పలువురు ఇంటర్నెట్లో వైరల్ చేశారు. కొద్ది సమయంలోనే ఫొటో వైరల్ కాగా.. ఇదే అంశంపై గుజరాత్‌కు చెందిన వెబ్సైట్ సైతం ఓ కథనం ప్రచురించింది. దీనిపై ప్రీతి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫొటోలు ఎలాంటి వాస్తవం లేదని.. అది ఫేక్ అని స్పష్టం చేసింది. పలువురు నెటిజన్స్ ప్రీతికి మద్దతు ప్రకటించారు. ఓ యూజర్ ఈ విషయంలో కోర్టుకు వెళ్లాలని నటికి సూచించారు. మరొకరు మీడియాలో విశ్వసనీయత పడిపోయిందనేదానికి ఇదొక ఊదాహారణ.. కేవలం వ్యూస్, టీఆర్పీ కోసం ఇంకొకరి ఇమేజ్‌తో ఆడుకోవడం తప్పు అంటూ కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలువడంతో ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించుకుంది. మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా మైదానంలో చాలా ఉత్సాహంగా కనిపించింది. ఆటగాళ్లను అభినందించింది.