Pratika Rawal : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయం నుంచి వేగంగా కోలుకుంటోంది. కుడిపాదం చీలమండ గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ ఆడలేకపోయిన ప్రతీక.. త్వరలోనే బ్యాట్ అందుకుంటానని చెబుతోంది. తన స్థానంలో వచ్చి.. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో జట్టును గెలిపించిన షఫాలీ వర్మ(Shafali Verma)పై ప్రశంసలు కురిపించిందీ ఓపెనర్. అంతేకాదు..విజేతలకు ఇచ్చిన వరల్డ్ కప్ మెడల్ తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేసింది హర్యానా అమ్మాయి.
‘షఫాలీకి ప్రత్యేకంగా మోటివేషన్ అవసరం లేదు. తను సహజంగానే దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో ఆడగల బ్యాటర్. ఫైనల్‌కు ముందు తను నా దగ్గరకు వచ్చింది. చక్రాల కుర్చీలో ఉన్న నన్ను చూసి బాధ పడింది. నువ్వు ఆడలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని నాలో అంది. అప్పుడు ఆమెతో పర్లేదు. మనకు ఇలాంటి గాయాలు మామూలే. ఫైనల్లో షఫాలీ ప్రత్యేక ముద్ర వేస్తుందని నేను నమ్మాను. నేను నమ్మినట్టే తను బ్యాటుతో బాదేసి.. బంతితోనూ సఫారీలను దెబ్బతీసింది’ అని ప్రతీక వెల్లడించింది.
Jay Shah Sir texted our manager saying he wanted to make arrangements. I went to get Pratika a medal, and finally, I now have my own medal: @RawalPratika, Cricketer@ShivaniGupta_5 | #IndianCricket #ICCWomensWorldCup2025 #IndiaWomenCricketTeam pic.twitter.com/Ee8Yy4D5e1
— News18 (@CNNnews18) November 7, 2025
ప్రపంచకప్ స్క్వాడ్ నుంచి వైదొలగడంతో విజేతలతో పాటు మెడల్ అందుకోలేకపోయింది ప్రతీక. ఐసీసీ నిబంధనల ప్రకారం స్క్వాడ్‌లోని సభ్యులకే మెడల్ ఇస్తారు. దాంతో.. ట్రోఫీ అందుకున్నాక సహాయక సిబ్బంది ఒకరు ఆమెకు తమ మెడల్ ఇచ్చారు. అయితే.. మెగా టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడిన ఓపెనర్‌కు ఛాంపియన్ మెడల్ ఇవ్వకపోవడంపై దుమారం రేగడంతో.. ఐసీసీ చీఫ్ జై షా (Jai Shah) చొరవ తీసుకున్నాడు. దాంతో.. ప్రతీకకు వరల్డ్ కప్ పతకం లభించింది. ఇంకేముంది తన పతకం తనకు రావడంతో సంతోషంలో మునిగిపోయానంటోంది ప్రతీక. గాయం నుంచి కోలుకుంటున్న ఆమె బ్యాట్‌ను మిస్ అవుతున్నాని చెప్పింది. ‘ప్రపంచకప్ ఆఖర్లో గాయంతో టోర్నీకి దూరమవ్వడం చాలా బాధించింది.
Power, Pride, and a 52-Run Statement – A victory beyond the boundary
India’s women cricketers have made history!A 52-run win over South Africa in the 2025 World Cup isn’t just a cricket victory — it’s a celebration of power, pride, and perseverance. From Shafali Verma’s… pic.twitter.com/VP2GJ0PGPm
— IndiaToday (@IndiaToday) November 7, 2025
అయితే.. సైకాలజీ చదివినందున నేను భావోద్వేగాలను బయటకు చూపించను. కానీ, మా నాన్న ప్రదీప్ రావల్ చాలా ఏడ్చారు. ఆయనను ఓదార్చి.. కోలుకోవడంపై దృష్టి సారించాను. ప్రస్తుతం గాయం తగ్గుముఖం పడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఎక్స్ రే తీయించుకోవాలి. అందులో అంతా బాగుందని వైద్యులు చెబితే వెంటనే రిహాబిలిటేషన్ ప్రారంభిస్తాను. అయితే.. హడావిడిగా మాత్రం మైదానంలోకి దిగను. దేశవాళీలో ఆడి మళ్లీ మునపటి లయ అందుకుంటే జాతీయ జట్టులోకి రావడం పెద్ద విషయమేమీ కాదు’ అని ప్రతీక పేర్కొంది.
Pratika Rawal today vs NZ: a hundred and a wicket – the first to achieve this feat for India in a World cup match 💯
✅ 122 (134)
✅ 4-0-19-1 pic.twitter.com/Uy5PebBovh— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025
నిరుడు వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్రతీకా నిలకడగా రాణించి వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి వచ్చింది. షఫాలీ వర్మ ఫామ్‌లో లేకపోవడంతో సెలెక్టర్లు ఆమెనే మంధానకు జోడీగా ఎంపికచేశారు. మెగా టోర్నీలో శుభారంభాలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలకమైందీ ఓపెనర్. న్యూజిలాండ్‌పై సెంచరీతో చెలరేగిన ప్రతీక చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఆరు మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ శతకంతో కలిపి 308 రన్స్ చేసిన ప్రతీక ప్రపంచకప్‌లో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచింది.