Pratika Rawal : తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులపై నజరానాల వర్షం కురుస్తోంది. క్రికెటర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నగదు.. కీలక పదవులు అప్పగిస్తున్నాయి. వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడిన ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal)కు ఏకంగా ప్రమోషన్ వచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) నుంచి సోమవారం లేఖ అందుకుంది టీమిండియా స్టార్. సోమవారం ఆ లెటర్‌ను పోస్ట్ చేసింది ప్రతీక.
ఏడాది క్రితం వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. నిలకడగా రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలకమైన ప్రతీకకు ఉత్తర రైల్వే సీనియర్ క్లర్క్‌గా ఉద్యోగమిచ్చింది. ఇటీవలే స్వదేశంలో ముగిసిన ప్రపంచ కప్‌లో అదరగొట్టిన ప్రతీకను అభినందిస్తూ రైల్వే శాఖ ప్రమోషన్ ఇచ్చింది. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (Officer On Special Duty) పోస్ట్‌కు ప్రమోట్ అయింది ప్రతీక. ఇదివరకు ఆమె ఉత్తర రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా ఎంపికైంది.
Grateful to the @RailMinIndia for recognising our efforts and promoting me as the Officer on Special Duty (osd). Railways has always been very supportive, and your belief means a lot to me💪 pic.twitter.com/5w6ckhC102
— Pratika Rawal (@RawalPratika) December 1, 2025
‘ఉత్తర రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా ఉన్న ప్రతీకా రావల్‌కు వరల్డ్ కప్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ప్రమోషన్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గ్రూప్ – బీ గెజిటెడ్ పోస్ట్ అయిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆమె ప్రమోట్ అయింది. ఇకపై లెవల్ 8 ఉద్యోగి అయిన ఆమెకు ఏడో పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు అందుతాయి. స్పోర్ట్స్ కోటా లేదా గ్రూప్ బీ పోస్ట్ ద్వారా ఈ ఆదేశాలను ఉత్తర రైల్వే వెంటనే అమలు చేయాలి’ అని రైల్వే శాఖ వెల్లడించింది. తన ప్రతిభను గుర్తించి ప్రమోషన్ ఇచ్చిన రైల్వే శాఖకు ప్రతీక కృతజ్ఞతలు తెలిపింది.
పదమూడో సీజన్ వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ట్రోఫీతో మురిసిపోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ప్రపంచకప్‌లో స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రతీక రావల్ శుభారంభాలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలకమైంది. న్యూజిలాండ్‌పై సెంచరీ(122), ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీతో రాణించిన ప్రతీక చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడి టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma) ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో మ్యాచ్ విన్నర్ అయింది. ప్రపంచకప్‌లో ప్రతీక 308 పరుగులు చేసింది.
When injured, all Pratika Rawal cared about was getting back to bat. 💪#CricketTwitter pic.twitter.com/noj8oJT6QX
— Female Cricket (@imfemalecricket) November 20, 2025