చెన్నై: యువ చెస్ ఆటగాడు ప్రణవ్ ఆనంద్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. బెంగళూరుకు చెందిన పదిహేనేండ్ల ప్రణవ్.. రొమేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో 2500 పాయింట్ల ఎలో రేటింగ్ మార్క్ దాటడం ద్వారా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. దీంతో భారత గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య 76కు చేరింది. తాజా టోర్నీలో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఎడురాడో బొనేలితో మ్యాచ్ ‘డ్రా’ చేసుకోవడం ద్వారా.. ప్రణవ్ మూడో జీఎం నార్మ్ ఖాతాలో వేసుకున్నాడు.