ప్రేగ్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజానందతో పాటు అతడి సహచర ఆటగాడు అరవింద్ చిదంబరం ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. ఐదు రౌండ్లు ముగిసేటప్పటికీ ఈ ఇద్దరూ 3.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. అరవింద్‌తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మరో నాలుగు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో ఎవరు చాంపియన్‌గా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.