సెయింట్ లూయిస్ : సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద టైటిల్‌కు చేరువయ్యాడు. బుధవారం జరిగిన ఎనిమిదోరౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్ లాగ్రెవ్ను ఓడించిన ప్రజ్ఞా.. అమెరికా జీఎం వెస్లీ సోతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
నల్లపావులతో ఆడిన ప్రజ్ఞా తెలివైన వ్యూహంతో 28 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఈ విజయంతో 5 పాయింట్లు సాధించిన భారత గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది చివర్లో జరిగే ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఆఖరి రౌండ్లో ప్రజ్ఞానంద తెల్ల పావులతో నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరితో తలపడనున్నాడు.