14వ తెలంగాణ ఓపెన్ రాష్ట్రస్థాయి ఇంటర్-స్కూల్స్ తైక్వాండో చాంపియన్షిప్ 2026లో పవర్ హౌస్ తైక్వాండో అకాడమీ లిటిల్ ఛాంప్స్ అద్భుత ప్రతిభ కనబరిచారు. క్రమశిక్షణ, పట్టుదలకు తోడు నైపుణ్యాన్ని ప్రదర్శించిన యువ క్రీడాకారులు 9 బంగారు పతకాలు, 1 వెండి పతకం, 6 కాంస్య పతకాలు గెలుపొంచారు. ఒక టోర్నమెంట్లో ఇన్నేసి పతకాలు సాధించడం పవర్ హౌస్ అకాడమీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన అని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 19 మంది పాల్గొనగా వీరిలో 16 మంది పోడియం మీద సగర్వంగా పతకాలు అందుకోవడం సంతోషకరమైన విషయమని వారు వెల్లడించారు.
తెలంగాణ ఓపెన్ స్టేట్ లెవల్ ఇంటర్-స్కూల్స్ తైక్వాండో చాంపియన్షిప్ 2026లో రాష్ట్రం నలుమూలల నుంచి కఠిన పోటీ ఎదురైనప్పటికీ, పవర్ హౌస్ జట్టు క్యోరుగు, పూమ్సే విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ గర్వకారణమైన సందర్భంలో వరల్డ్ తైక్వాండో గ్లోబల్ సభ్యులు, నేషనల్ పూమ్సే, క్యోరుగు రిఫరీలు అరవింద్ నంద్యాల సురేష్ బోయా (PHTA స్థాపకులు) విజేతలను అభినందించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని వారు ప్రశంసించారు. ప్రతి విద్యార్థి పడిన కష్టం ఈ చారిత్రాత్మక విజయానికి కారణమని వారు తెలిపారు.

జాతీయ స్థాయి ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా పవర్ హౌస్ తైక్వాండో అకాడమీ క్రమశిక్షణ అందిస్తోందని, నిరంతర సాధన.. ప్రతిభాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. యువతరంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ మరిన్ని గొప్ప విజయాలను సాధించేందుకు అకాడమీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇటీవలి ఈ విజయాన్ని పురస్కరించుకుని త్వరలోనే ఒక చిన్న విజయోత్సవ సమావేశం (సక్సెస్ మీట్) నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ అద్భుత విజయంతో పవర్ హౌస్ తైక్వాండో మరోసారి ప్రముఖ శిక్షణ కేంద్రంగా తన స్థానాన్ని బలపరచుకుందని, సమీప భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది అకాడమీ యాజమాన్యం.