IND vs WI : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో వెస్టిండీస్ బ్యాటర్లు దంచారు. దాంతో, ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(42), చివర్లో కెప్టెన్ రొవమన్ పావెల్(40 నాటౌట్). ధాటిగా ఆడారు. కైల్ మేయర్స్(25) తక్కువకే ఔటయ్యాడు. రెండో టీ20లో దంచి కొట్టిన నికోలస్ పూరన్(20)ను కుల్దీప్ వెనక్కి పంపాడు. అతను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడడతో విండీస్ స్కోర్ వేగం తగ్గింది. షిమ్రాన్ హెట్‌మైర్(9)తో కలిసి పావెల్ ధాటిగా ఆడాడు. ముకేశ్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. దాంతో, ఆతిథ్య జట్టు 159 పరుగులు చేసింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. ముకేశ్‌కుమార్, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
ఐదు టీ20 సిరీస్‌లో రెండింటిలో నెగ్గిన కరీబియన్ జట్టు 2-0లో ఆధిక్యంలో ఉంది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ టీమిండయా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. వీళ్లిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ చెలరేడంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.