WI vs BAN : భారత పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి.. ఆపై బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్ సమర్పించుకున్న వెస్టిండీస్ పొట్టి క్రికెట్లో మాత్రం చెలరేగిపోయింది. తొలి టీ20లో హిట్టర్లు సిక్సర్ల మోత మోగించగా ఆతిథ్య బంగ్లాకు విండీస్ షాకిచ్చింది. టీ20 సిరీస్‌లో తొలి టీ20లో విజయం సాధించింది. బోణీ కొట్టింది. రొవ్మన్ పావెల్(44 నాటౌట్), కెప్టెన్ షాయ్ హోప్(46 నాటౌట్)లు పోటాపోటీగా దంచేయగా భారీ స్కోర్ చేసింది కరీబియన్ టీమ్. అనంతరం బౌలర్లు జైడన్ సీల్స్(3-32) కట్టడి చేయగా.. 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది.
పొట్టి క్రికెట్ అంటే చాలు దంచికొట్టే వెస్టిండీస్ బ్యాటర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఛత్తోగ్రామ్‌లో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు ఓపెనర్లు. అలిక్ అథనజె(34), బ్రాండన్ కింగ్(33)లు 59 పరుగులతో శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత షాయ్ హోప్(46 నాటౌట్ 28 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్(44 నాటౌట్ 28 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దొరికిన బంతిని దొరికినట్టు బాదేశారు. వీరిద్దరి విధ్వసంతో బంగ్లా ముందు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది విండీస్.
Rovman Powell is named PLAYER OF THE MATCH for his blistering 44* off just 28 deliveries 💪🏏💥 #RovmanPowell | #BANvWI | #Sportify pic.twitter.com/Zf5Fg2okcb
— Sportify (@Sportify777) October 27, 2025
ఛేదనలో బంగ్లా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూ సాగింది. ఓపెనర్ సైఫ్ హసన్(8) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. గాయం నుంచి కోలుకుని తొలి మ్యాచ్ ఆడిన కెప్టెన్ లిటన్ దాస్(5) సైతం నిరాశపరిచాడు. ఆ తర్వాత జైడన్ సీల్స్(3-32), జేసన్ హోల్డర్(3-31)లు వికెట్ల వేట కొనసాగించి ఆతిథ్య జట్టు బ్యాటర్లను ఒత్తిడిలో పడేశారు. తౌహిద్ హృదయ్(28), తంజిమ్ హసన్(33)లు జట్టును గెలిపించేందుకు గట్టిగానే పోరాడారు. కానీ, వారికి సహకరించేవాళ్లు కరువయ్యారు. విండీస్ బౌలర్లు వికెట్ల వేటతో ప్రత్యర్తిని 149కే ఆలౌట్ చేశారు. మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 29న జరుగనుంది.
Finally a win for West Indies and they take a 1-0 lead in the T20I series. 🔥 #WestIndies #Bangladesh #BANvsWI #MrCricketUAE pic.twitter.com/WXLwtIS1tp
— Mr. Cricket UAE (@mrcricketuae) October 27, 2025