INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టింది. ఓపెనర్లు డగౌట్ చేరడంతో పాక్ మిడిలార్డర్ పోరాడుతోంది. ప్రస్తుతం సిడ్రా అమీన్(15), అలియా రియాజ్(5)లు భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. ఆరు ఓవర్లకు 2 వికెట్ల నస్టానికి 37 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టుకు పూజా వస్త్రాకర్ ఆదిలోనే బ్రేక్ ఇచ్చింది. దంబుల్లా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసింది. గుల్ ఫెరొజా(5)ను చేసి వికెట్ల వేట మొదలెట్టింది. ఆ తర్వాత బంతి అందుకున్న ఆమె బౌన్సర్‌తో మునీబా అలీ(11)ను బోల్తా కొట్టించి పాక్‌ను కష్టాల్లో పడేసింది. దాంతో, పాక్ పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.