Viral news | పశ్చాత్తాపంతో దొంగిలించిన వస్తువులు తిరిగిచ్చిన దొంగ.. క్షమాపణ కోరుతూ ఓ నోట్..!
Viral news | ఒక దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశాడు. ఆ ఇంట్లోని వస్తువులు అన్నింటిని దొంగిలించాడు. తీరా దొంగిలించిన వస్తువులన్నీ మూటగట్టకున్న తర్వాత ఆ ఇళ్లు ప్రముఖ రచయితదని తెలుసుకున్నాడు.
Viral news : ఒక దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశాడు. ఆ ఇంట్లోని వస్తువులు అన్నింటిని దొంగిలించాడు. తీరా దొంగిలించిన వస్తువులన్నీ మూటగట్టకున్న తర్వాత ఆ ఇళ్లు ప్రముఖ రచయితదని తెలుసుకున్నాడు. ఒక రచయిత ఇంట్లో దొంగతనం చేసినందుకు పశ్చాత్తాపం చెందాడు. దొంగలించిన వస్తువులను అక్కడే పెట్టేశాడు. అంతేగాక తనను క్షమించమంటూ దొంగిలించిన వస్తువుల దగ్గరే నోట్ రాసి పెట్టాడు.
ఈ వింత ఘటన మహరాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ మరాఠీ కవి, సామాజికవేత్త నారాయణ్ సువే 2010లో కన్నుమూశారు. ప్రస్తుతం ఇంట్లో కుమార్తె సుజాత, ఆమె భర్త గణేష్ ఘారే నివసిస్తున్నారు. వారు విరార్‌లోని కుమారుడి వద్దకు వెళ్లడంతో 10 రోజులు ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంట్లో దూరి ఎల్ఈడీ టీవీతోపాటు పలు విలువైన వస్తువులను దొంగలించాడు.
మిగిలిన వస్తువులను కూడా దొంగిలించేందుకు మరుసటి రోజు కూడా అదే ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో రచయిత నారాయణ్ ఫోటో, జ్ఞాపికలు కనిపించాయి. దాంతో ఆ దొంగ పశ్చాత్తాపం చెందాడు. ముందురోజు దొంగిలించిన వస్తువులను కూడా తిరిగి తెచ్చి ఆ ఇంట్లో పెట్టేశాడు. గొప్ప సాహితీవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు తనను క్షమించాలని కోరుతూ యజమానికి నోట్ రాసి గోడకు అతికించాడు.
సుజాత, ఆమె భర్త విరార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నోట్‌ను చూసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు టీవీ సెట్‌పై లభించిన వేలిముద్రల అధారంగా విచారణ చేపట్టారు. కాగా, రైటర్ నారాయణ్ ముంబైలో అనాథగా పెరిగారు. కూలి పనులు చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఆయన రెండో తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ మరాఠీ భాషాలోని ఉత్తమ రచయితల్లో ఒకరిగా పేరొందారు.
నారాయణ్ పట్టణ శ్రామిక వర్గంపై అనేక రచనలు చేశారు. ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రష్యా నుంచి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అందుకున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

