Charghesheet On Cricketer : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది. ఇంతకూ అతడు ఎవరంటే.. బంగ్లాదేశ్ ‘ఏ’ (Bangladesh A Team) జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్ (Tofael Ahmed Raihan). ఈ యంగ్‌స్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో.. సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
టోఫెల్ తనను మోసగించాడని ఫిర్యాదుదారు కీలక ఆధారాలను సమర్పించింది. తమ ఇద్దరి మధ్య జరిగిన ఫేస్బుక్ ఛాట్, హోటల్ రూమ్ బుకింగ్ వివరాలు, వైద్య పరీక్షల రిపోర్టును బాధితురాలు పోలీసులకు అప్పగించింది. అవన్నీ పరిశీలించాక మహిళలు, పిల్లలపై దాడుల నియంత్రణ చట్టం (Women and Children Repression Prevention Act) సెక్షన్ 9(1) కింద టోఫెల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశాం. తదుపరి విచారణ డిసెంబర్ 30న జరుగనుంది అని స్థానిక ఎస్సై తెలిపారు.
Bangladesh pace bowling Allrounder Tofael Ahmed is accused of R**e Charge.
Police have submitted a charge sheet against cricketer Tofayel Ahmed Raihan in a r**e case filed by a young woman. The hearing is set for 30 December. On that day, the charge sheet will be formally… pic.twitter.com/s94KjttmCq
— Shadman Sakib Arnob (@arnuX05) December 11, 2025
బంగ్లా యువ క్రికెటరైన టోఫెల్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అప్పటినుంచి ఆమెతో ఛాట్ చేస్తూ ప్రేమ వల పన్నాడు టోఫెల్. జనవరి 31న సదరు అమ్మాయిని హోటల్ గదికి తీసుకెళ్లాడు. హోటల్ సిబ్బంది తన భార్య అని ఆమెను పరిచయం చేసిన అతడు.. ఆమె అనుమతి లేకుండానే తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు టోఫెల్ లైగింక దాడికి పాల్పడ్డాడు. అయితే.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అని ఆ యువతి టోఫెల్‌ను నిలదీసింది.
🚨 𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚 𝗡𝗘𝗪𝗦 🚨
Tofael Ahmed Raihan, a Bangladesh ‘A’ cricketer, has been charged in a sexual assault case.
Investigators say evidence including hotel records and medical findings support the allegations.
The next hearing is set for December 30. ⚖️#Cricket… pic.twitter.com/YDCYzEbT79
— Gully Point (@gullypoint_) December 11, 2025
కానీ, అతడు నిరాకరించడంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఆగస్టు 1న పోలీసులను ఆశ్రయించింది. ఆమె వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేశారు. అయితే.. సెప్టెంబర్ 24న హైకోర్టు అతడికి ఆరు నెలల ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ గడువు ముగిసేలోపు మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ ట్రిబ్యునల్ ముందు లొంగిపోవాలని కోర్టు అతడిని ఆదేశించింది. కానీ, టోఫెల్ మాత్రం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడాన్ని పోలీసులు తప్పుపడుతూ ఛార్జిషీట్ దాఖలు చేశారు.