పూణె: ప్రో కబడ్డీ లీగ్-11వ సీజన్ టైటిల్‌ను హర్యానా స్టీలర్స్ దక్కించుకుంది. సీజన్ ఆరంభం నుంచి టేబుల్ టాపర్‌గా ఉంటూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్ చేరిన ఆ జట్టు.. టైటిల్ పోరులో 32-23తో పాట్నా పైరేట్స్‌ను మట్టికరిపించి ఈ టోర్నీలో తొలిసారి ట్రోఫీని సాధించింది. గతేడాది ఫైనల్లో పూణెరి పల్టన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన హర్యానా ఈసారి మాత్రం పట్టు విడవకుండా టోర్నీ ఆసాంతం అదరగొట్టి తమ కప్ కలను సొంతం చేసుకుంది. తొలి అర్థ భాగం ముగిసేసరికి 15-12తో ఆధిక్యంలో ఉన్న హర్యానా.. సెకండాఫ్‌లో మరింత జోరు పెంచింది. హర్యానా తరఫున రైడర్ శివమ్ పటారె 9 పాయింట్లతో సత్తా చాటగా ఆల్‌రౌండర్ షాద్లోయ్ (7), వినయ్ (6) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.