Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఈ జంట.. అక్కడ నూతన సంవత్సరాది వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు. 2022లో చివరిసారిగా సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు. కొత్త ఏడాది 2023ని ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ చేసుకున్నారు. దుబాయ్ ఫుడ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విరుష్క జంట సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.