Phobe Litchfield : వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్ (Phoebe Litchfield) సరికొత్త చరిత్ర లిఖించింది. సెమీ ఫైనల్లో శతక్కొట్టిన (119 : 93బంతుల్లో)ఈ చిచ్చరపిడుగు.. ప్రపంచ కప్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టింది. భారత బౌలర్లకు చుక్కలు చూపించిన తను.. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా అవతరించింది. నాకట్ మ్యాచ్‌లో శతకం సాధించిన మూడో ఆసీస్ బ్యాటర్‌గా మరో రికార్డు పట్టేసిందీ యంగ్‌స్టర్.
డీవై పాటిల్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన లిచ్‌ఫీల్డ్ మరో రికార్డును బ్రేక్ చేసింది. గురువారం నాటికి వయసు.. 22 ఏళ్ల 195 రోజులున్న తను లారా వొల్వార్డ్త్(Lara Wolvaardt)ను అధిగమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా కెప్టెన్ అయిన లారా 26 ఏళ్ల 186 రోజుల వయసులో వరల్డ్ కప్ సెంచరీతో చరిత్ర సృష్టించింది. పదమూడో సీజన్లోనే తను ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో 169 రన్స్ చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) 2017 వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగులతో విరుచుకుపడింది. అప్పుడు కౌర్ వయసు.. 28 ఏళ్ల 135 రోజులు.
Ayer Laura Wolvaardt y hoy Phoebe Litchfield. Inning para el recuerdo.
119 en 93 con 4sx17 y 6sx3
127,95 de strike rate.
Superstar ⭐️ pic.twitter.com/ARY0KmazT4
— Andrés (@AndresMarchante) October 30, 2025
నాకౌట్స్‌లో మూడో ఆస్ట్రేలియన్‌గా మరో రికార్డు తన పేరిట రాసుకుందీ అమ్మాయి. ఆమెకంటే ముందు అలీసా హేలీ(2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై 170, అంతకుముందు సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై 129) రెండుసార్లు, కరేనె రోల్టన్(2005 ఎడిషన్ ఫైనల్లో భారత్‌ఫై 107 నాటౌట్) ఒకసారి నాకౌట్ పోరులో శతకాలతో రెచ్చిపోయారు. ఆసీస్ భావితారగా ఎదుగుతున్న లిచ్‌ఫీల్డ్‌కు భారత జట్టుతో మ్యాచ్ అంటే భలే ఇష్టం. ఇప్పటివరకూ టీమిండియాపై తను 96.61 స్ట్రయిక్ రేటుతో 627 పరుగులు సాధించింది. అందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు (78, 63, 119, 35, 60, 25, 88, 40, 119) ఉండడం విశేషం.