లక్నో : భారత ‘ఏ’ జట్టుతో లక్నో వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా ‘ఏ’ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 532/6 డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు వికెట్ కీపర్ ఫిలిప్పీ (87 బంతుల్లో 123 నాటౌట్), స్కాట్ (81) దూకుడుగా ఆడి ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.
అయితే భారత్ కూడా దీటుగా స్పందిస్తున్నది. జగదీశన్ (50*) అజేయ అర్ధశతకంతో క్రీజులో ఉండగా అభిమన్యు (44) రాణించాడు. రెండో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి భారత్.. 116/1తో నిలిచింది. జగదీశన్‌తో పాటు సాయి సుదర్శన్ (20*) క్రీజులో ఉన్నాడు.