IPL Auction 2024: ఇంగ్లండ్ టీ20 జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ టీ20లలో శతకాలతో మోతెక్కిస్తున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాల్ట్‌ను నిన్న దుబాయ్‌లో ముగిసిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలు విస్మరించాయనే బాదో లేక మరే కారణమో గానీ వెస్టిండీస్ బౌలర్లను మాత్రం ఈ బ్యాటర్ ఉతికారేశాడు. టరోబా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 57 బంతుల్లోనే ఏడు బౌండరీలు, ఏకంగా పది భారీ సిక్సర్ల సాయంతో 11 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో కూడా సాల్ట్.. 56 బంతుల్లోనే నాలుగు బౌండరీలు, తొమ్మిది భారీ సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసిన విషయం విదితమే.
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సాల్ట్‌ను ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ వేలానికి వదిలేసింది. ఆ సీజన్లో సాల్ట్ రూ. 2 కోట్లతో క్యాపిటల్స్ తరఫున ఆడినా అంతగా ప్రభావం చూపలేదు. అయితే హిట్టర్‌గా పేరున్న సాల్ట్‌ను నిన్నటి వేలంలో భారీ ధర దక్కించుకుంటాడని విశ్లేషకులు భావించినా పది ఫ్రాంచైజీలూ అతడిని పక్కనబెట్టేశాయి.
Unsold in 2024😳😳
Lastly he played for DC
“Unsold in IPL 2024 auction, Phil Salt smashes records hours later in England’s big win over West Indies”
2 Back to Back centuries in T20 International against WI in WI 🫡#PhilipSalt #WIvENG #ENGvWI pic.twitter.com/bjAO6yDB7s
— Shiv Mohan (@shivmohan_1991) December 20, 2023
ఇక ఇంగ్లండ్ – వెస్టిండీస్ మధ్య టరోబా వేదికగా మంగళవారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలోనే మూడు వికెట్లు మ్తారమే కోల్పోయి 267 పరుగులు చేసింది. సాల్ట్‌తో పాటు బట్లర్ (55), లివింగ్‌స్టోన్ (54)లు దంచికొట్టారు. అనంతరం విండీస్ కూడా ధాటిగానే ఆడినా ఆ జట్టు కీలక సమయంలో వికెట్లు కోల్పోయి చతికిలపడింది. 15.3 ఓవర్లలో విండీస్.. 192 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 51, 3 బౌండరీలు, 5 సిక్సర్లు) రాణించాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ ఈనెల 22న ట్రినిడాడ్ వేదికగా జరుగనుంది.