SLW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక బ్యాటింగ్‌లో విఫలమైంది. భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డీవై పాటిల్ స్టేడియంలో హాసిని పెరీరా(85), కెప్టెన్ చమరి ఆటపట్టు (46)లు మంచి పునాది వేసినా మిడిలార్డర్ చేతులెత్తేసింది. స్పిన్నర్ షోర్నా అక్తర్ (3-27) విజృంభణతో 202 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయాన్ని సాధించేందుకు బంగ్లా ఉవ్విళ్లూరుతోంది.
ప్రపంచ కప్‌లో సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ శ్రీలంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. డీవై పాటిల్ స్టేడియంలో టాస్ గెలిచిన లంకకు పేసర్ మరుఫా అక్తర్ ఆదిలోనే షాకిచ్చింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ విష్మీ గుణరత్నే(0)ను ఎల్బీగా వెనక్కి పంపింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన హాసిని పెరీరా(19 నాటౌట్) ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మూడు, నాలుగు బంతుల్ని బౌండరీకి పంపింది. నిశితా అక్తర్ ఓవర్లో ఫోర్ బాదిన చమరి ఆటపట్టు(43 నాటౌట్) వన్డేల్లో 4వ వేల పరుగుల క్లబ్లో చేరింది.
Bangladesh pull off a remarkable comeback, bowling out Sri Lanka for the first time in women’s ODIs 👏 pic.twitter.com/aecufe9Rvz
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2025
మరుఫాను టార్గెట్ చేసిన లంక కెప్టెన్ ఐదో ఓవర్లో తొలి రెండు బంతులకు 6, 4 సాధించి బంగ్లాను భయపెట్టింది. నిహిదా అక్తర్ వేసిన 9 వ ఓవర్లో రెచ్చిపోయిన ఆటపట్టు ఒక సిక్స్, రెండు ఫోర్లతో 14 రన్స్ పిండుకుంది. వీరిద్దరి జోరుతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
అర్థ శతకానికి చేరువైన ఆటపట్టును ఔట్ చేసిన రబేయా ఖాన్ బంగ్లాకు బ్రేకిచ్చింది. అయినా.. నీలాక్షి డిసిల్వా(37) సాయంతో స్కోర్ బోర్డును ఉరికించింది పెరీరా. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్ని స్కోర్ 170 దాటించారు. అక్కడి నుంచి వికెట్ల వేటకు తెరతీసింది షోర్నా అక్తర్(3-27). సంచలన బౌలింగ్ చేసిన తను.. డిసిల్వాను ఎల్బీగా ఔట్ చేసింది. ఆ తర్వాత.. సంజీవని(2)ని డగౌట్ చేర్చింది. దాంతో.. 174-4తో పటిష్ట స్థితిలో ఉన్న లంక షోర్నా తిప్పేయడంతో ఆలౌట్ ప్రమాదంలో పడింది. తొమ్మిదో వికెట్‌కు 18 రన్స్ జోడించి లంక స్కోర్ 200లు దాటించిన ప్రబోధినిని రబేయా ఔట్ చేయగా.. మల్కీ మదర రనౌటయ్యింది. దాంతో.. 202 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
A fine innings from Hasini Perera but Bangladesh claw their way back as Sri Lanka’s innings continues to implode
LIVE: https://t.co/djqTr7haAq pic.twitter.com/1XHkHm4i7N
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2025