పహల్గాంలో నరమేధం సృష్టించిన పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 26 మంది అమాయకులను ఊచకోత కోసిన ఉగ్రమూకల పీకను భారత త్రివిధ దళాలు తుదముట్టించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైనికదళాలు జరిపిన మెరుపు దాడిలో పాక్ ఉగ్ర శిబిరాలు నేలమట్టం అయ్యాయి. దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మొదలుపెడితే సెహ్వాగ్, యువరాజ్‌సింగ్, ధవన్, విజేందర్‌సింగ్, యోగేశ్వర్‌దత్, నిఖత్జరీన్ సోషల్‌మీడియా వేదికలుగా త్రివిధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రశంసించాయి.
భయం లేని సమిష్టితత్వం. పరిమితులు లేని శక్తి. భారత్‌కు ప్రజలే ఎనలేని బలం. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. మేమంతా ఒక టీమ్. జై హింద్.
ఎవరైనా మీ పై రాళ్లు విసిరితే..పూలతో పాటు కుండీలను కూడా విసిరేయండి.
ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు భారత్ దీటుగా సమాధానం చెబుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భార త్ మాతాకీ జై.
‘మన దేశం యొక్క బలం మన ప్రజల సమిష్టితత్వమే. ఏదైతే సరైనదో దాన్ని కాపాడుకోవాల్సిందే. దేశంగా కలిసి ఉండటమే కాదు, ఒక జట్టుగా శాంతికి భంగం కల్గించే వాటిని సమిష్టిగా ఎదుర్కొందాం. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. భారత్ ప్రతీసారి పుంజుకుంటుంది, సమిష్టితత్వాన్ని చాటుతుంది. జై హింద్.
మన సైనికులు బెదిరించరు, దీటుగా సమాధానం చెబుతారు. మన హీరోల శక్తి, సామర్థ్యాలు ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా చూపించారు.
భారత్‌తో పాటు ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. పాకిస్థాన్ ఉగ్రమూకల అంతుచూసిన భారత త్రివిధ దళాలకు అభినందనలు. భారత్‌పై ఎవరైనా దాడి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా సమాధానమిచ్చారు. జై హింద్.