PCB | కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్లను పదే పదే మార్చడంపై ఆ జట్టు పరిమిత ఓవర్ల, టెస్టు హెడ్‌కోచ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చెప్పినట్టు సమాచారం. అపజయాలు వెంటాడుతున్నా కెప్టెన్లపై నమ్మకముంచాలని ఈ ఇద్దరూ పీసీబీకి విన్నవించినట్టు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే పాక్ నిష్క్రమించాక బాబర్ ఆజమ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. షాహిన్ షా అఫ్రిదిని, టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను సారథులుగా నియమించింది. ఇక ఈ ఏడాది న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడాక అఫ్రిదినీ తప్పించి తిరిగి ఆ బాధ్యతలను బాబర్‌కే అప్పగించింది.