PCB : పాకిస్థాన్ క్రికెట్లో మరో దుమారం రేగింది. లార్డ్స్ టెస్టు(Lords Test)లో ఘోర పరాజయం, ఆపై ఏడుగురు ఆటగాళ్లపై వేటు.. తదనంతర పరిణామాలతో ఇప్పటికే అప్రతిష్టపాలైన పాక్ జట్టుపై ఫిక్సింగ్(Fixing) ఆరోపణలు వస్తున్నాయి. లార్డ్స్‌లో ఓటమికి క్రికెటర్ల వైఫల్యంతో పాటు… ఫిక్సింగ్ కోణం కూడా ఉందని మీడియాలో కథనాలు వ్యాపిస్తున్నాయి. దాంతో, పాక్ బోర్డు సత్వరమే విచారణకు ఆదేశించింది. ఆటగాళ్లపై క్రమశిక్షణపరంగా.. అంతర్గత విచారణ జరుపుతున్నామని సోమవారం పీసీబీ మీడియా ప్రతినిధి వెల్లడించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో చెత్త ప్రదర్శనతో సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు ఫిక్సి్ంగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. లార్డ్స్ టెస్టు ఓటమి అనంతరం ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లను స్వదేశం పంపిన పాక్ బోర్డు అంతర్గత విచారణకు ఆదేశించింది. క్రికెటర్లపై క్రమశిక్షణ పరమైన విచారణ జరుగుతోందని పీసీబీ మీడియా ప్రతినిధి అమిర్ మిర్ వెల్లడించాడు.
🚨 REPORTS 🚨
The dramatic changes in recent times have raised questions, with the PCB initiating an internal disciplinary inquiry following media reports. 🇵🇰🏏
Players’ devices have reportedly been handed over to the board and will remain in its custody until the conclusion of… pic.twitter.com/Y6yzu2lRKj
— Sportskeeda (@Sportskeeda) September 7, 2026
‘ఆటగాళ్ల క్రమశిక్షణపై మీడియాలో వస్తున్న కథనాలను కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ ఆటాగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తన గురించి మీడియాలో కథనాలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఈ విషయాలను అంతర్గతంగా సమీక్షిస్తాం. పీసీబీ ప్రమాణాలు, నియమనిబంధనల మేరకు విచారణ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను విశ్వసించవద్దని కోరుతున్నాం. ప్రస్తుతానికైతే పీసీబీ ఈ వ్యవహారంపై ఏ కామెంట్ చేయదలచుకోలేదు. అభిమానులు, వాటాదారులు అందరూ పీసీబీ నుంచి అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి’ అని అమిర్ మిర్ పేర్కొన్నాడు.
లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, అవైస్ జఫార్, ఖుర్రం షెహజాద్.. ఈ ఏడుగురిని స్క్వాడ్ నుంచి తప్పించింది పాక్ బోర్డు. సయీం అయూబ్‌తో పాటు ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అరాఫత్ మిన్హాస్, మొహమ్మద్ ఇమ్రాన్, సాద్ బైగ్, ఇమ్రాన్ రంధవా, రజుల్లాహ్లు చివరి టెస్టుకోసం స్క్వాడ్‌తో కలువనున్నారు. నామమాత్రమైన మూడో టెస్టు సెప్టెంబర్ 9న బర్మింగ్హమ్లో జరుగనుంది.