Haris Rauf: పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఊహించని షాకులిచ్చింది. అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు టీ20 లీగ్‌లలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేసింది. ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించగా.. అందులో ఆడాలని పీసీబీ పలుమార్లు కోరినా అతడు దానికి విముఖత చూపాడు. దీంతో పీసీబీ.. హరీస్ రౌఫ్‌పై క్రమశిక్షణా చర్యలకు దిగింది. పీసీబీ తాజా ఆదేశాలతో హరీస్ రౌఫ్.. ఈ ఏడాది జూన్ దాకా టీ20 లీగ్‌లలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటించింది. డిసెంబర్ – జనవరిలో పాక్-ఆసీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో ఆడాలని, కనీసం రోజులో 10-15 ఓవర్లు అయినా వేయాలని టీమ్ మేనేజ్మెంట్ కోరినా అతడు మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ జరుగుతుండగానే అతడు దానిని పక్కనబెట్టి బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో ఆడాడు. ఇది పీసీబీకి మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది.
Update: PCB terminated Haris Rauf’s central contract due to his refusal to join Pakistan’s Test squad, with no NOC for foreign league play until June 30, 2024.
Fair decision? #HarisRauf #MohsinNaqvi pic.twitter.com/zZ5PvgQM4E
— Alisha Imran (@Alishaimran111) February 15, 2024
పీసీబీ తాజాగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అతడు టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడానికి గాయం గానీ ఇతర సరైన కారణం గానీ చూపలేదని అందుకే అతడు సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నామని పేర్కొంది. అంతేగాక హరీస్ రౌఫ్ గైర్హాజరీకి గల కారణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మొత్తానికి అతడి కాంట్రాక్టును రద్దు చేసిన పీసీబీ.. 2024 జూన్ 30 దాకా ఎటువంటి ఫారెన్ లీగ్‌లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేయబోమని తేల్చి చెప్పింది.