గత మ్యాచ్‌లో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ జట్టు.. తమ మాజీ సారధి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీకి సిద్దమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని మయాంక్ తెలిపాడు. అదే సమయంలో తమ జట్టులో మనీష్ పాండే స్థానంలో ఆవేష్ ఖాన్ ఆడుతున్నట్లు రాహుల్ వెల్లడించాడు.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయి, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ.
A look at the Playing XI for #PBKSvLSG
Live – https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL https://t.co/N8C5PowfUQ pic.twitter.com/hmphJhkluA
— IndianPremierLeague (@IPL) April 29, 2022