పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. లక్నో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (46) అవుటయ్యాడు. సందీప్ శర్మ వేసిన బంతిని కట్ చేసేందుకు డీకాక్ ప్రయత్నించాడు. దాంతో సందీప్ అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ అవుటివ్వలేదు.
అయితే వాళ్లు రివ్యూ తీసుకోవడానికి ముందే డీకాక్ పెవిలియన్ బాటపట్టాడు. దాంతో 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీంతో 13 ఓవర్ల తర్వాత లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.