పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. మొదటి బంతికే కీలక వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) తను ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. లియామ్ లివింగ్స్టన్ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన వార్నర్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న చాహర్ సులభంగా అందుకున్నాడు. దాంతో వార్నర్ నిరాశగా మైదానం వీడాడు.