చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు. అయితే తను మాత్రం వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడుతూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (30) కూడా పెవిలియన్ చేరాడు.
రబాడ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అతను టైమింగ్ మిస్సయ్యాడు. అంతకుముందు అదే మాదిరి వేసిన బంతిని బౌండరీకి తరలించిన అతను.. మరో బౌండరీ కోసం ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమవడంతో గాల్లోకి లేచిన బంతిని పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ అందుకున్నాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. చెన్నై కెప్టెన్ జడేజా క్రీజులోకి వచ్చాడు.