చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు.. పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్నే నిలిపింది. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ తీసిన తీక్షణ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత శిఖర్ ధవన్ (88 నాటౌట్), రాజపక్స (42) ఇద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టును ముందుకు నడిపించారు. ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే కావడంతో చెన్నైకి వ్యూహాలు పెద్దగా మార్చాల్సిన అవసరం కూడా రాలేదు.
ఈ క్రమంలోనే ధవన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ నెమ్మదిగా స్కోరు బోర్డు వేగం పెంచేందుకు ప్రయత్నించారు. ఇలా చేసే క్రమంలో బ్రావో బౌలింగ్‌లో రాజపక్స భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. దీంతో క్రిజులోకి వచ్చిన లియామ్ లివింగ్స్టన్ (7 బంతుల్లో 19) వచ్చీ రావడంతోనే భారీ షాట్లు ఆడాడు.
అయితే చివరి ఓవర్లో మరో భారీ షాట్‌కు యత్నించి తొలి బంతికే అవుటయ్యాడు. తర్వాత వచ్చి బెయిర్‌స్టో (6) ఒక ఫోర్ కొట్టి రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 2, తీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు.
Innings Break!
An 88* from Shikhar Dhawan and well supported by Bhanuka Rajapaksa (42) propels #PBKS to a total of 187/4 on the board.
Scorecard – https://t.co/V5jQHQZNn0 #PBKSvCSK #TATAIPL pic.twitter.com/oJ1297kek7
— IndianPremierLeague (@IPL) April 25, 2022