PBKS Playoff Stats | ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనున్నది. చండీగఢ్‌లోని ముల్లాపూర్‌లో నేడు జరిగే ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విజయం సాధించాలని పంజాబ్ కింగ్స్ జట్టు ఉత్సాహంతో ఉన్నది. ఈ సారి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇద్దరి నేతృత్వంలో జట్టు సీజన్లో ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా రాణించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. పంజాబ్ కింగ్స్ దాదాపు 11 సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరుకోవాలన్న కసితో ఉన్నది. ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌లో పంజాబ్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.
పంజాబ్ క్వాలిఫయర్-1లో ఒక్కసారే ఆడింది. ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. 2014లో జార్జ్ బెయిలీ నాయకత్వంలో పంజాబ్ జట్టు క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడి.. పరాజయం పాలైంది. ఆ తర్వాత పంజాబ్ జట్టు క్వాలిఫయర్-2 గెలిచి.. ఫైనల్స్‌కు చేరినా.. కప్పు తృటిలో చేజారింది. పంజాబ్ ప్లేఆఫ్స్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆ జట్టు ఒకసారి మాత్రమే గెలవగలిగింది. మూడింటిలో ఓటమిని చవిచూసింది. 2008, 2014లో జరిగిన ఎలిమినేటర్‌లో పంజాబ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గత సీజన్లో కోల్‌కతాకు టైటిల్‌ను సాధించిన అయ్యర్.. ఈ సారి సైతం టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ప్లేఆఫ్స్‌లో పంజాబ్ తరపున వృద్ధిమాన్ సాహా అత్యధిక పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 156 పరుగులు చేశాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ 131 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. మనన్ వోహ్రా 127 పరుగులతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ప్లేఆఫ్స్‌లో పంజాబ్ తరఫున కరణ్వీర్ సింగ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. మూడు ఇన్నింగ్స్‌లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ జాన్సన్ ఐదు వికెట్లతో రెండవ స్థానంలో, అక్షర్ పటేల్ మూడు వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు.
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పీ అవినాష్, ప్రభ్సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, ప్రవీణ్ దూబే, ప్రియాంష్ ఆర్య, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆరోన్ హార్డీ, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, సూర్యాంష్ షెడ్జే, శశాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, కుల్దీప్ సేన్, విజయ్‌కుమార్ విశాక్, యష్ ఠాకూర్, మిచెల్ ఓవెన్, కైల్ జామిసన్.