Couple Friendly trailer | టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రాజెక్ట్ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్బ్యానర్పై తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
లవ్ చాయిస్ ఆ, నీడ్ ఆ అనేది నాకు తెలీదు కానీ ఫేట్ అని మాత్రం తెలుసు… అది రావాలనుకుంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు.. అంటూ సాగుతున్న డైలాగ్స్ ప్రేమలోని ప్రేమ కొత్త కోణాన్ని ఆవిస్కరిస్తూ యూత్‌ను ఆలోచింపేజేసేలా సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ఇంతవరకు ఏమైనా సంపాదించి ఎప్పుడైనా నువ్వు సుత్తిగానీ, బల్బు కానీ కొనుకున్నావారా..? అంటూ సాగే డైలాగ్స్ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తున్నాయి.
నెల్లూరు కుర్రాడైన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ, సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్(రాపిడో లాంటివి) చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి (మానస వారణాసి) అతని బైక్‌లో ప్రయాణిస్తుంది. అలా అనుకోకుండా కలిసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత ఎలా ప్రేమలో పడతారు..? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ నాలో నేను వీడియో సాంగ్ రొమాంటిక్ ఫీల్‌తో సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి అజయ్ కుమార్ రాజు పీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
The world has 8.2 billion people.
But their world is each other 💞 #CoupleFriendlyTrailer (Telugu) out now ❤️
▶️ https://t.co/NnDHwgTU0ZIn cinemas on FEB 14th in Telugu & Tamil.
This Valentine’s Day is going to be #CoupleFriendly 💖@santoshsoban @varanasi_manasa @manojac… pic.twitter.com/fWorj70wVA
— UV Creations (@UV_Creations) February 2, 2026
కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్..