బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 36-26తో పుణెరి పల్టన్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అజింక్యా పవార్ (11), మన్జీత్ (8) రాణించగా.. పల్టన్ తరఫున పంకజ్ (8) సత్తాచాటాడు. సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తలైవాస్‌కు ఇదే తొలి విజయం కాగా.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన పుణెరి పల్టన్ 5 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో పట్నా 44-30తో బెంగాల్‌పై గెలుపొందింది.