RCB vs DC : చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ హిట్టర్ రజత్ పాటిదార్(52) అర్ధ సెంచరీ బాదాడు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు యాభైతో జట్టుకు అండగా నిలిచాడు. ఈ సీజన్లో ఐదో అర్ధ శతకం సాధించిన ఈ చిచ్చరపిడుగు రసిక్ దార్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు.
పాటిదార్ కొట్టిన బంతిని గమనించిన అక్షర్ పటేల్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. దాంతో, 123 వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో డేంజరస్ విల్ జాక్స్ 41 పరుగులతో ఆడుతున్నాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 134/3.