Srilanka Cricket : పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం శ్రీలంక క్రికెట్ స్క్వాడ్లను ప్రకటించింది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్, ఆపై జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేసింది. అయితే.. ఆసియా కప్ స్క్వాడ్‌లోని పలువురిపై వేటు వేశారు సెలెక్టర్లు. యువ పేసర్ మథీశ పథిరన (Matheesha Pathirana) ఇన్ఫెక్షన్ కారణంగా సిరీస్‌కు దూరమవ్వగా.. మోకాలి గాయం నుంచి కోలుకోని మరో పేసర్ దిల్షాన్ మధుషనక సైతం అందుబాటులో లేడు. దాంతో.. యార్కర్ స్పెషలిస్ట్ ఇషాన్ మలింగ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఆసియా కప్ వైఫ్యల్యంతో కంగుతిన్న శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌లకు సన్నద్దమవుతోంది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్, అనంతరం జింబాబ్వేతో పొట్టి సిరీస్‌లో చరిత అలసంక బృందం తలపడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం శుక్రవారం సెలెక్టర్లు 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. నువనిందు ఫెర్నాండో, మిలాన్ రత్ననాయకే, నిశాన్ మధుష్క, దునిత్ వెల్లలాగే వన్డేలకు ఎంపికవ్వలేదు. వీరి బదులు.. లహిరు ఉడార, కమిళ్ మిశార, హసరంగ, ప్రమోద్ మధుషాన్లను తీసుకున్నారు సెలెక్టర్లు.
OFFICIAL : Sri Lanka ODI and T20 Squad for Pakistan Tour. pic.twitter.com/Sq1HmL6idJ
— Cricket X (@CricketX64) November 7, 2025
ఆసియా కప్‌లో నిరాశపరిచిన వెల్లలాగే, పేసర్ కరుణరత్నే, బినుర ఫెర్నాండో స్థానంలో రాజపక్సే, లియనగే, దేషాన్ హేమంతలు పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యారు. నవంబర్ 17న రావల్పిండిలో మొదటి వన్డేతో ఆతిథ్య పాక్, శ్రీలంక, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్ ప్రారంభం కానుంది.
శ్రీలంక వన్డే స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, లహిరు ఉడార, కమిల్ మిశార, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియనగే, పవన్ రత్ననాయకే, హసరంగ, థీక్షణ, జెఫ్రే వాండర్సే, చమీర, అసితా ఫెర్నాండో, ప్రమోద్ మధుషాన్, ఇసాన్ మలింగ.
శ్రీలంక టీ20 స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిశార, కుశాల్ మెండిస్, దసున్ శనక, కమిందు మెండిస్, భానుక రాజపక్సే, జనిత్ లియనగే, హసరంగ, థీక్షణ, దుశాన్ హేమంత, చమీర, నువాన్ తుషార, అసితా ఫెర్నాండో, ఇషాన్ మలింగ.
𝐒𝐫𝐢 𝐋𝐚𝐧𝐤𝐚 𝐓𝐨𝐮𝐫 𝐨𝐟 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 𝟐𝟎𝟐𝟓 🏏
The Sri Lanka National Men’s Team will tour Pakistan in November 2025 to participate in an ODI series and a T20I Tri-Series.
The T20I Tri-Series will feature Pakistan, Sri Lanka, and Zimbabwe.
The national team is… pic.twitter.com/GSPRGqGdt4— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 3, 2025