ఓవల్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final)కు అంతా రెఢీ అయ్యింది. బుధవారం ఓవల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సిద్ధం అయ్యాయి. ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్‌లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మేస్తో ఆ ఇద్దరూ ఫోటో దిగారు.
What the two teams are playing for 🏆
Not long to go now for the #WTC23 Final to begin! #TeamIndia pic.twitter.com/8EAI2fUaNX
— BCCI (@BCCI) June 6, 2023
ఫైనల్ వరకు చేరేందుకు ఎంతో శ్రమించామని, ఇక మేస్‌ను అందుకోవడమే తమ లక్ష్యమని ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ అన్నాడు. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, ఎన్నో విజయాలను దక్కించుకోవాల్సి వచ్చిందని, ఇంట్లోనే కాదు.. విదేశీ టూర్లనూ సక్సెస్ సాధించామని కమ్మిన్స్ తెలిపాడు. గత కొన్నాళ్ల నుంచి తమ బృందం బాగా ప్రదర్శిస్తోందన్నాడు.
Captain Pat Cummins has confirmed who will claim the final bowling spot for tomorrow's #WTC23 clash.
Likely Australia XI for the final ⬇️https://t.co/mdoLqp1c21
— ICC (@ICC) June 6, 2023
రోహిత్ శర్మ కూడా ఫైనల్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. గత కొన్నాళ్ల నుంచి తమ జట్టు నిలకడగా క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు. టోర్నమెంట్ చాలా టఫ్‌గా సాగిందని, గత రెండేళ్ల నుంచి నిలకడగా ఆడడం వల్లే ఈ దశకు చేరుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మూడు శాఖల్లోనూ బలంగా ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. ఫైనల్ కోసం రోహిత్ సేన కఠోరంగా శ్రమిస్తోంది.
📽️ Oval Diaries ft. #TeamIndia 🏏#WTC23 pic.twitter.com/KM4fL8DgKj
— BCCI (@BCCI) June 6, 2023
ఇరు జట్లకు ఓవల్ తటస్థ వేదికే. రెండు జట్లకూ హోం సపోర్టు లేదు. అయినా ఎక్కడ ఆడినా తమకు కొంత సపోర్టు ఉంటుందని రోహిత్ అన్నాడు. న్యూట్రల్ వేదికలపై ఆడడం తమకు అలవాటే అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను గెలవలేదని, ఈ ట్రోఫీని కూడా చేజిక్కించుకుంటామని కమ్మిన్స్ తెలిపాడు.
Who will hold the mace at the end of the #WTC23 Final? 💪
The captains had their say ➡️ https://t.co/lHLFzv4AF4 pic.twitter.com/Tum9LcXYJJ
— ICC (@ICC) June 6, 2023