Glenn Phillips | వెల్లింగ్టన్: పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ఐదు వికెట్లతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 164 పరుగులకు ఆలౌటైంది. లియాన్ (41) టాప్ స్కోరర్ కాగా.. టాపార్డర్ విఫలమైంది. కివీస్ బౌలర్లలో హెన్రీ 3, సౌథీ రెండు వికెట్లు సాధించారు.
అనంతరం 369 పరుగుల లక్ష్యఛేదనలో శనివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (56), డారిల్ మిషెల్ (12) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న కివీస్.. విజయానికి 258 పరుగుల దూరంలో ఉంది.