Nishant Dev | భారత యువ బాక్సర్ నిషాంత్దేవ్ పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం సాధిస్తాడన్న అంచనాల మధ్య బరిలోకి దిగిన నిషాంత్..శనివారం జరిగిన పురుషుల 71కిలోల క్వార్టర్ ఫైనల్ బౌట్లో 1-4 తేడాతో మార్కో వెర్డె (మొరాకో) చేతిలో పోరాడి ఓడాడు. బౌట్ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రత్యర్థి బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నిషాంత్..ఓటమి వైపు నిలువడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బౌట్లో చురుకుగా కదులుతూ కనిపించిన ఈ హర్యానా యువ బాక్సర్ విసిరిన పంచ్‌లకు మొరాకో బాక్సర్ సాగిలపడిపోయాడు. అయినా రిఫరీలు నిషాంత్ వైపు కాకుండా మార్కో వైపే మొగ్గుచూపారు. దీంతో పురుషుల బాక్సింగ్‌లో భారత ప్రస్థానం ముగిసింది.