IPL 2025 : ఓవైపు వికెట్లు పడుతున్నా రియాన్ పరాగ్(86) మాత్రం తన పవర్ హిట్టింగ్తో ఈడెన్ గార్డెన్స్‌ను హోరెత్తిస్తున్నాడు. సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన పరాగ్.. ఆ తర్వాత నాలుగు బంతుల్ని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపాడు. వీటిల్ స్వీప్ షాట్‌తో కొట్టిన సిక్సర్ మాత్రం ఖతర్నాక్ అని చెప్పాలి.
పరాగ్ విధ్వంసంతో ఆ ఓవర్లో 32 రన్స్ వచ్చాయి. దాంతో, స్కోర్ 130కి చేరింది. మరో ఎండ్‌లో హెట్‌మైర్(26) సైతం దంచేస్తున్నాడు. నరైన్ ఓవర్లో ఓ సిక్సర్ సంధించాడు. దాంతో, రాజస్థాన్ 15 ఓవర్లకు 155 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 52 రన్స్ కావాలి.
Captain at it 👊
Riyan Parag with a fighting fifty for #RR 💪
Will he be able to guide his team home? 🏡
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR pic.twitter.com/xjJGcz0nmw
— IndianPremierLeague (@IPL) May 4, 2025
భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు మళ్లీ అదే తడబాటు కొనసాగిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో 205 పరుగుల కొట్టేందుకు సిద్ధమైన ఆ జట్టును మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తిలు వణికించారు. ధాటిగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్(34)ను ఔట్ చేసిన అలీ కోల్‌కతాకు బిగ్ బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వరుణ్.. ఒకే ఓవర్లో ధ్రువ్ జురెల్(0), వనిందు హసరంగ(0)లను డకౌట్ చేసి రాజస్థాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. 71కే సగం వికెట్లు కోల్పోయిన జట్టును గెలిపించేందుకు పరాగ్, హెట్‌మైర్‌లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.