IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రిషభ్ పంత్(118 నాటౌట్) విధ్వంసక శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో రికార్డు ధర పలికిన పంత్ ఆఖరి పోరులో తనదైన షాట్లతో అలరిస్తూ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో దడ పుట్టించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఓపెనర్ మిచెల్ మార్ష్( 67) తో రెండో వికెట్‌కు కలిసి 152 రన్స్ జోడించాడు. అనంతరం నికోలస్ పూరన్(13) జతగా స్కోర్ బోర్డును ఉరికించిన పంత్.. ఆర్సీబీకి 227 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్ 1కు అర్హత సాధించాలనుకున్న ఆర్సీబీ ఆశలన్నీ టాపార్డర్ మీదే ఉన్నాయి. చూడాలి.. ఏం జరుగుతుందో.
నాకౌట్ పోరుకు ముందు ఆర్సీబీకి అసలైన పరీక్ష ఎదురైంది. చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కొండంత స్కోర్ చేసింది. బెంగళూరు బౌలర్లను ఉతికేసిన లక్నోసారథి రిషభ్ పంత్ (118 నాటౌట్) మునపటిలా చెలరేగి సెంచరీ సాధించాడు. అగ్నికి వాయవుడు తోడైనట్టు అతడికి మిచెల్ మార్ష్(67) జత కలవగా లక్నో స్కోర్ రాకెట్లా దూసుకెళ్లింది. అంతే.. ఆర్సీబీ ముందు 228 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది లక్నో.
𝐀 𝐑𝐢𝐬𝐡𝐚𝐛𝐡 𝐏𝐚𝐧𝐭 𝐬𝐡𝐨𝐰 🍿
Second #TATAIPL hundred for the #LSG skipper 💯
Lucknow has been thoroughly entertained tonight 👏
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/dF32BWDKmS
— IndianPremierLeague (@IPL) May 27, 2025
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చిన లక్నో ఈసారి ఆర్సీబీపై చెలరేగింది. ఆరంభంలోనే ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్(14)ను నువాన్ తుషార యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. దాంతో 25 వద్ద లక్నో మొదటి వికెట్ పడింది. మిచెల్ మార్ష్(67), రిషభ్ పంత్(118 నాటౌట్)లు.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. దయాల్ వేసిన 4వ ఓవర్లో 6, రెండు ఫోర్లతో 18 రన్స్ సాధించిన పంత్.. పవర్ ప్లే తర్వాత మరింత చెలరేగాడు.
𝙈𝙖𝙧𝙫𝙚𝙡𝙤𝙪𝙨 𝙈𝙖𝙧𝙨𝙝 🔥
Mitchell Marsh races to his 6️⃣th fifty of the season 😍#LSG cruising along.
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/T0eLPbr0zs
— IndianPremierLeague (@IPL) May 27, 2025
భువనేశ్వర్‌ను ఉతికేస్తూ.. వరుసగా 6, 4 బాదిన లక్నో సారథి.. అనంతరం సుయాశ్ శర్మకు వరుస ఫోర్లతో చుక్కలు చూపించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, లక్నో 10 ఓవర్లకు 101 రన్స్ చేసింది. ఆ తర్వాత జోరు పెంచిన మార్ష్ కూడా సుయాశ్ ఓవర్లోనే సిక్సర్‌తో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సీజన్లో ఏడో ఫిఫ్టీ బాదిన ఈ చిచ్చరపడిగు భువనేశ్వర్ ఓవర్లో ఔటయ్యాడు. దాంతో, రెండో వికెట్‌కు 152 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
మార్ష్ ఔటైనా లక్నో స్కోర్ వేగం తగ్గలేదు. భువీ వేసిన 18వ ఓవర్లో ఫైన్ లెగ్‌లో బౌండరీతో 95కి చేరువైన పంత్.. ఒంటికాలితో కవర్స్‌లో ఫోర్ బాది సెంచరీ సాధించాడు. అనంతరం జంప్ చేసి సంబురాలు చేసుకున్న అతడు ఆ ఒక్క షాట్‌తో అతడు లక్నో స్కోర్ 200లు దాటించాడు. దయాల్ ఓవర్లో కళ్లుచెదిరే 4, 6 బాదిన పంత్.. షెపర్డ్ వేసిన 20వ ఓవర్లోనూ ఒంటిచేత్తో సిక్సర్ బాదాడు. ఐదో బంతికి నికోలస్ పూరన్() ఔట్ కాగా 3 వికెట్ల నష్టానికి లక్నో 227 పరుగులు కొట్టింది.
Special centurion with a special celebration 🥳
Rate this on a scale of 1️⃣ to 🔟 👇
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/d55Ez2rNcN
— IndianPremierLeague (@IPL) May 27, 2025