ముంబై: ఈ ఏడాది జులైలో ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్ టెస్టులో గాయపడి అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కాలి గాయానికి శస్త్రచికిత్స అనంతరం కొద్దిరోజులు విరామం తీసుకున్న అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు పంత్నుఉ త్వరలో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగబోయే రెండు టెస్టులకు భారత ‘ఏ’ జట్టుకు సారథిగా నియమించారు.
అక్టోబర్ 30 నుంచి బెంగళూరులోని సీవోఈ వేదికగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో వచ్చేనెల 14 నుంచి మొదలుకాబోయే రెండు టెస్టుల సిరీస్కు సన్నాహకంగా జరుగుతున్న ఈ మ్యాచ్లలో పంత్కు డిప్యూటీగా సాయి సుదర్శన్ వ్యవహరించనున్నాడు. రెండో మ్యాచ్కు భారత జట్టు రెగ్యులర్ ఆటగాైళ్లెన కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, ధ్రువ్ జురెల్ సైతం అందుబాటులో ఉండనున్నారు.