హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన షేక్ సాజిదా స్వర్ణంతో సహా రజతంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 100మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో బరిలోకి దిగిన సాజిద 3:31: 54సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకంతో సొంతం చేసుకుంది.
అదే జోరు కొనసాగిస్తూ 100మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో సాజిద 01:44:43 సెకన్లతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. పాన్ అమెరికా గేమ్స్‌లో పతకాలు సాధించిన సాజిద దేశ ఖ్యాతిని, గౌరవాన్ని ఇనుమడింపజేసింది.