IND vs PAK : టీ20 వరల్డ్ కప్‌లో అసలుసిసలైన సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే.. వర్షం కారణంగా 30 నిమిషాలు టాస్ ఆలస్యమైంది. టాస్ గెలుపొందిన పాక్ సారథి బాబర్ ఆజాం(Babar Azam) రోహిత్ సేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఐర్లాండ్‌పై అద్భుత విజయంతో టీమిండియా.. పాక్‌ను ఓడించేందుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు మెగా టోర్నీ తొలి పోరులోనే అమెరికా చేతిలో కంగుతిన్న పాక్ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్థాన్ జట్టు : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజాం(కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది, నసీం షా, మహ్మద్ అమిర్, హ్యారిస్ రవుఫ్.