INDW vs PAKW : మహిళల ఆసియా కప్ ఆరంభం రోజే క్రికెట్ ఫ్యాన్స్‌ను బిగ్ ఫైట్ అలరించనుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు దాయాది పాకిస్థాన్‌ను ఢీ కొడుతోంది. దంబుల్లా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ నిడా దార్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చిరకాల ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంపై దృష్టి పెట్టనుంది.
ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఆసియా కప్‌లో ఏడుసార్లు చాంపియన్ అయిన భారత్‌కు పాక్‌పై ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు ఆరు సార్లు తలపడ్డాయి. భారత్ ఏకంగా ఐదు విజయాలతో దాయాదిపై ఆధిపత్యం చెలాయించింది.
భారత జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయలాన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా గోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్.
పాకిస్థాన్ జట్టు : సిడ్రా అమీన్, గుల్ ఫెరొజా, మునీబా అలీ(వికెట్ కీపర్), నిడా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, టుబా హసాన్, సదియా ఇక్బాల్, నశ్రా సంధు, సైదా అరూబ్ షా.