ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశ 35వ మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ ఆజాం ఫీల్డింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ మ్యాచ్లో పాక్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఉసామ మిర్ ప్లేస్లో హసన్ అలీ వచ్చాడు. ఇక కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చాడు. గాయంతో టోర్నీకి దూరమైన మ్యాట్ హెన్రీ స్థానంలో ఇష్ సోథీని తీసుకున్నారు.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిఫ్స్, మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.
పాకిస్థాన్ : అబ్దుల్లా షఫిక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజాం(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సాద్ షకీల్, అఘా సల్మాన్, షాహీన్ ఆఫ్రిది, హసన్ అలీ, వసీం జూనియర్, హ్యరిస్ రవుఫ్.