PAK vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. మెగా టోర్నీలో ఇంకా బోణీ కొట్టని పాకిస్థాన్(Pakistan) పసికూన కెనడా(Canada)తో తలపడుతోంది. న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి బాబర్ ఆజాం బౌలింగ్ తీసుకున్నాడు.
ఇదే మైదానంలో టీమిండియా చేతిలో చిత్తైన దాయాది జట్టు ఒక్క మార్పు చేసింది. మరోవైపు సాద్ బిన్ జాఫర్ నేతృత్వంలోని కెనడా అదే జట్టుతో ఆడనుంది. ఐర్లాండ్‌పై సూపర్ విక్టరీ కొట్టిన కెనడా.. మరో విజయంతో సూపర్ 8కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.
పాకిస్థాన్ జట్టు : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సయీం ఆయుబ్, బాబర్ ఆజాం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ ఆఫ్రిది, నసీం షా, మహ్మద్ అమిర్, హ్యారిస్ రవుఫ్.
కెనడా తుది జట్టు : అరోన్ జాన్సన్, నవ్‌నీత్ ధలివల్, పర్గాత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్ కీపర్), దిల్‌ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హెల్గెర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖీ, జెరెమె గోర్డన్.