టీ20 ప్రపంచ కప్లో మరో సమరానికి తెర లేచింది. షార్జా క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఫీల్డింగ్ ఎంచుకొని చేజింగ్ చేసి గెలిచిన పాక్.. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అప్లయి చేసింది.
ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ నుంచి తుది జట్ల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్ నుంచి బాబర్ అజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫకర్ జమాన్, మహమ్మద్ హఫీజ్, సోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, హాసన్ అలీ, హరిశ్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిదీ బరిలో ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు నుంచి మార్టిన్ గప్తిల్, డెవోన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, విలియమ్సన్(కెప్టెన్), టిమ్ సైఫెర్ట్(వికెట్ కీపర్), డరైల్ మిట్చెల్, జేమ్స్ నీషమ్, మిట్చల్ సాంత్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోది బరిలో ఉన్నారు.
Pakistan have won the toss and will field first 🏏
— ICC (@ICC) October 26, 2021
Who are you backing in this one? #T20WorldCup | #PAKvNZ | https://t.co/EbyOH0kpjg pic.twitter.com/4HsIqgunom