టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జోరుమీదుంది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించింది. దీంతో గ్రూప్ 2 లో పాక్ టాప్ పొజిషన్‌కు ఎగబాకింది. ఆఫ్ఘనిస్థాన్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పాక్ గెలుపులో కెప్టెన్ బాబర్ అజామ్ ముఖ్య పాత్ర పోషించాడు. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన అసిఫ్ అలీ 4 సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను టర్న్ చేశాడు. పాక్‌ను గెలిపించాడు. కెప్టెన్ బాబర్ 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ 5 వికెట్ల తేడాలో 19 ఓవర్లకే మరో ఓవర్ మిగిలి ఉండగానే 148 పరుగులు చేసి విజయం సాధించింది.
సోయబ్ మాలిక్ వికెట్ పడిపోగానే.. ఇక పాకిస్థాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ.. తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆసిఫ్ అలీ.. 4 సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒక్కసారిగా పాక్ వైపు తిప్పాడు. కేవలం 7 బంతుల్లో 25 పరుగులు చేసి పాక్‌ను విజయ తీరాల వైపు నడిపించాడు అలీ.
ఓడిపోతుందనుకున్న పాకిస్థాన్‌ను చివరి ఓవర్లలో గెలిపించిన ఆసిఫ్ అలీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
ఆప్ఘాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రాణించాడు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో వంద వికెట్లు తీసి రహీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. హాఫ్ సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను కూడా రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్.. రెండు వికెట్లు తీసి 100 వికెట్ల క్లబ్లో చేరాడు.
Pakistan's sensational run continues 🔥#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/oWSthyVsD7
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Babar Azam with another classy half-century 👏#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/vmxaTQcOrx
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
💯 wickets in T20Is for Rashid Khan 🙌
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
He gets the scalp of Hafeez, who is gone for 10!#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/VSOsYbDRz9