గాలె: సహచరులు విఫలమైన చోట కెప్టెన్ బాబర్ ఆజమ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. షఫీఖ్ (13), ఇమామ్ (2), అజహర్ (3), రిజ్వాన్ (19), సల్మాన్ (5), నవాజ్ (5) విఫలమయ్యారు. 148 రన్స్కే 9 వికెట్లు కోల్పోయిన స్థితిలో నసీమ్ షా (52 బంతుల్లో 5 నాటౌట్) అండతో బాబర్ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36/1తో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉన్న లంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్గా 40 రన్స్ ముందంజలో ఉంది.