SL vs PAK | గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ పోరాడుతున్నది. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మిడిలార్డర్ రాణించడంతో సోమవారం ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. షకీల్ (69 బ్యాటింగ్; 6 ఫోర్లు), సల్మాన్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (13), సర్ఫరాజ్ అహ్మద్ (17), ఇమామ్ (1) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 242/6తో రెండో రోజు కొనసాగించిన లంక చివరకు 312 పరుగులకు ఆలౌటైంది.