ఇస్లామాబాద్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్థాన్, భారత మధ్య మ్యాచ్ జరగనున్నది. ఆ హై వోల్టేజ్ మ్యాచ్‌పై అందరి దృష్టి ఉన్నది. కానీ పాకిస్థాన్ అభిమానలు మాత్రం భారత్‌పై ఆగ్రహంతో ఉన్నారు. దుబాయ్‌లో మ్యాచ్ జరిగే సమయంలో.. భారత క్రికెటర్లను ఎవరూ హత్తుకోరాదు అని వార్నింగ్‌లు వస్తున్నాయి. పాక్ క్రికెట్ అభిమానులు చేస్తున్న హెచ్చరికకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పాకిస్థాన్ జర్నలిస్టు ఫరిద్ ఖాన్ ఆ వీడియోను పోస్టు చేశారు.
భారత్‌తో మ్యాచ్ జరిగే సమయంలో స్నేహాన్ని పక్కనపెట్టాలని, కోహ్లీని కానీ, ఇతర భారత ప్లేయర్లను హగ్ చేసుకోరాదు అని పాక్ అభిమానులు తమ దేశ క్రికెటర్లను కోరారు. చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంలో పాక్‌లో ఆడేందుకు భారత్ ససేమీరా ఒప్పుకోలేదు. టీమిండియా పాకిస్థాన్‌లో ఆడేందుకు నిరాకరించడంతో.. భారత్,పాక్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్విస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత పాక్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను వీక్షించకుండా అవకాశం చేజారిపోయిందని అభిమానులు సీరియస్ అవుతున్నారు. దీని పట్ల ఆగ్రహంగా ఉన్న అభిమానులు భారత్‌ను శత్రువుగా చూడాలని పాక్ క్రికెటర్లను కోరుతున్నారు.
Pakistan fans really angry with Indian cricket team 🇵🇰🇮🇳🤬
They want Pakistan players to not hug Indian players during Champions Trophy 😱
— Farid Khan (@_FaridKhan) February 15, 2025